Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది.

Health Tips: మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Wood Apple Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2024 | 9:40 PM

ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైనది మారేడుదళం, మారేడుఫలం. ఈ బిల్వఫలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగాను ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. మారేడు పండులోని ఔషధగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మారేడు పండు కూడా కాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా, పుల్లగా ఉంటుంది. కానీ, అదే పండు పూర్తిగా పండుగా మారినప్పుడు..తీపి పులుపుతో కూడిన రుచిలో ఉంటుంది. మారేడు పండు జ్యూస్‌తో అజీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్‌, పేగు పూత వంటి సమస్యలు నివారించుకోవచ్చు.

కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మారేడు పండు కన్నా, లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది. మారేడు ఆకుల్ని దంచి, ఆ రసాన్ని తాగితే షుగర్ వ్యాధి ఉన్నవారికి గొప్ప మేలు చేకూరుస్తుంది. ఈ మారేడు రసాన్ని రోజు కొద్దికొద్దిగా మోతాదు పెంచుకుంటూ తాగడం వల్ల షుగర్ క్రమబద్ధీకరించుకోవచ్చు. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

మారేడు కాయను దంచి నీళ్లలో మరిగించి పటికబెల్లం కలుపుకుని తాగితే ఎంతగానో వేధించే ఎక్కిళ్ళు కూడా ఆగుతాయి. అంతేకాదు కడుపులోను, పేగులలోని అల్సర్పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, పండ్లకు ఉన్నది. ముఖం మెరవాలన్నా… జుట్టు రాలడం తగ్గాలన్నా… బిల్వ పండు తినవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.