Viral Video: ‘ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే’ విమానంలో చాయ్‌వాలా..! వీడియో చూస్తే అవాక్కే..
మొదట ఒక మహిళకు అందించాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులకు కూడా ఇచ్చాడు. వీరిలో ఓ వృద్ధుడు, ఓ మహిళ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి ఉండటం కనిపించింది. అయితే ఈ విమానం ఎక్కడికి వెళుతోంది. ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
విమానంలో వింత వింత సంఘనలు ఇటీవల కాలంలో తరచూ వైరల్ అవుతున్నాయి. ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లాస్క్‌లోంచి టీ పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం నాకు భారతీయ రైళ్లలో టీ అమ్మేవారిని గుర్తు చేస్తుంది. థాయ్‌లాండ్ వెళ్లే విమానంలో భారతీయ ప్రయాణికులు లోకల్ ట్రైన్‌లా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఓ కొత్త వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి కూడా భారతీయుడు ఉన్నాడు. 36,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లాస్క్‌లో ఉన్న టీని పేపర్ కప్పులో పోసి ఇతర ప్రయాణికులకు ఇస్తున్నాడు. ఇది చూస్తుంటే ఇండియా లోకల్ రైలు ప్రయాణం గుర్తొస్తోంది.
ఈ వీడియోను కేవలం 24 గంటల్లోనే నాలుగు లక్షల మంది వీక్షించారు. అంటూ కొందరు జోక్ చేయగా, మరికొందరు వింత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో aircrew.in అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది. ‘చాయ్, చాయ్’ అని పిలుస్తూ, ఫ్లాస్క్ నుండి టీని పేపర్ కప్పులో పోస్తున్నారు. మొదట ఒక మహిళకు అందించాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులకు కూడా ఇచ్చాడు. వీరిలో ఓ వృద్ధుడు, ఓ మహిళ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి ఉండటం కనిపించింది. అయితే ఈ విమానం ఎక్కడికి వెళుతోంది. ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
View this post on Instagram
ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివే జరుగుతాయని అంటున్నారు. క్యాబిన్ సిబ్బంది, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అంటూ ఒకరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..