Green Chilli: పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..

పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో మిరపకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జీవక్రియను పెంచుతుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Green Chilli: పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
Green Chilli
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2024 | 7:51 PM

పచ్చిమిర్చి.. మనందరి ఇళ్లలో పచ్చి మిర్చి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే…కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు.. ఇలా ప్రతీ వంటకంలో పచ్చిమిరపకాయలు వాడుతుంటారు. ఘాటు వంటకాలను ఇష్టంగా తినేవారు మరింత రుచి కోసం పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చి మిర్చి కేవలం రుచి, ఘాటు కోసం మాత్రమే కాదు.. పుష్కలమైన పోషకాలు కూడా అందిస్తుందని మీకు తెలుసా..? పచ్చిమిరపకాయలో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, ఎతో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ సరైన శారీరక పనితీరుకు కీలకమైనవి. అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.

పచ్చి మిరపకాయలలో ఉండే ముఖ్య పదార్ధం క్యాప్సైసిన్…జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్యాప్సైసిన్ వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియను పెంచుతుంది. వేగవంతమైన జీవక్రియ వలన నిల్వ చేయబడిన కొవ్వు విచ్ఛిన్నం అయిపోయి బరువు తగ్గడం జరుగుతుంది. మిరపకాయలలో విటమిన్ B5 ఉండటం వల్ల కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నం సులభం అవుతుంది. ఇక పచ్చి మిరపకాయల్లో కేలరీలు కూడా ఉండవు. పచ్చి మిరపకాయలు విటమిన్ ఎను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.

పచ్చి మిరపకాయల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లకు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. ఇక విటమిన్ ఇ చర్మానికి మేలు చేసే సహజమైన నూనెలను సృష్టిస్తుంది. భోజనంతోపాటు పచ్చి మిర్చి తీసుకోవడం సంతోషాన్ని ఇస్తుందని… ఆందోళనను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. వీటిలో ఉండే క్యాప్సైసిన్ యాంటీ డిపెసెంట్ గా వర్క్ చేస్తుంది. ఆనందకరమైన మానసిక స్థితి కొనసాగించేందుకు కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.