AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

చలికాలంలో కొందరిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో పదే పదే అనారోగ్యానికి గురై జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి హోమియోపతి ప్రభావవంతమైన మార్గం. హోమియోపతి అంటే ఏమిటి... దాని ద్వారా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
చలికాలంలో శరీరం, మనసు వెచ్చగా ఉండేందుకు ఇష్టపడుతుంది. దీంతో వేడి ఆహారాన్ని తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చల్లటి వాతావరణం వల్ల శరీరం వెచ్చగా ఉండాలంటే వేడి వేడి ఆహారాన్ని తినాలను కోవడం సహజం. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఈరోజే వదిలేయడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Shaik Madar Saheb
|

Updated on: Dec 23, 2024 | 7:42 PM

Share

చలి తీవ్రత పెరుగుతోంది.. అయితే.. శీతాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. ఈ కాలంలో చాలామంది వ్యాధుల బారిన పడుతుంటారు.. ముఖ్యంగా చలికాలంలో ప్రజలలో రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది.. ఇది తరచుగా జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలకు దారితీస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో విఫలమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. హోమియోపతి అనేది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఒక పద్ధతి. హోమియోపతి పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.. అయితే ముందు హోమియోపతి అంటే ఏమిటి..? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

హోమియోపతి ఒక పురాతన వైద్య విధానం. హోమియోపతిలో, మొక్కల వంటి సహజ వనరుల నుంచి మందులు తయారు చేస్తారు.. జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు వంటి అనేక వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. హోమియోపతి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. వ్యాధుల కారణాలపై పనిచేస్తుంది. హోమియోపతి ద్వారా రోగనిరోధక శక్తిని ఏయే మార్గాల్లో పెంచుకోవచ్చో తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పద్ధతులను అనుసరించండి..

ఢిల్లీలోని హోమియోపతికి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. శీతాకాలంలో వ్యాధులను నివారించడానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి హోమియోపతి మందులైన ఎచినాసియా ఔషధం.. కాల్కేరియా కార్బోనికా ఔషధాలను ఉపయోగించవచ్చు. ఈ ఔషధం జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఫాస్పరస్ ఔషధం గొంతు సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ వ్యాధులను నివారించడంలో సిలిసియా ఔషధం సహాయపడుతుంది. హోమియోపతి మిమ్మల్ని మందుల మీద మాత్రమే ఆధారపడేలా చేయదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని కూడా ఇది మీకు సలహా ఇస్తుంది.. అని తెలిపారు.

మందులు తీసుకోవడంతో పాటు, మీరు తగినంత నిద్ర పొందడం, పోషకమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. మీ నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి. మీ ఆహారంలో జంక్ ఫుడ్ తీసుకోవడం మానుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవద్దు.

శీతాకాలంలో, వెచ్చని బట్టలు ధరించండి

గోరువెచ్చని నీరు త్రాగండి..

చల్లని ఆహారాన్ని నివారించండి.

మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, విటమిన్ సి అధికంగా ఉండే వాటిని చేర్చండి.

తేలికపాటి వ్యాయామం లేదా యోగా..శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి