బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…
వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను భర్తీ చేసుకునేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. రహదారిపై వచ్చిపోయే కార్లను లిఫ్ట్ అడిగి బురిడీ కొట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన కొరపాటి నర్సింగరావు, ఏపీ మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్‌లు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు.
వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి నేరాలకు పాల్పడుతూ వచ్చారు. కార్లను అద్దెకు తీసుకుని వాటిని తనఖా పెట్టి డబ్బు తీసుకున్నారు. లిఫ్ట్ అడిగి మార్గమధ్యలో డ్రైవర్ ను బురిడీ కొట్టించి కార్లను అపహరించారు. బైకులను నకిలీ తాళాలతో తీసి చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్టోబర్ 27న సూర్యాపేటకు చెందిన మర్రు వెంకటేశ్వర్రావు విజయవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు తన కారులో బయలుదేరాడు. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రసాద్, నర్సింగ రావులు లిఫ్ట్ అడిగి వెంకటేశ్వర్రావు కారులో ఎక్కారు. మార్గమధ్యలో కారు యజమాని ఫోన్ నెంబరును నిందితులు తీసుకుని వారి నెంబరును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. విజయవాడకు వెళ్లగానే కారును రోడ్డు పక్కన ఆపి ఓ దుకాణంలో మిఠాయి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ప్రసాద్, నర్సింగరావులు ఆ కారుతో ఉడాయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

