20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??

20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??

Phani CH

|

Updated on: Dec 23, 2024 | 8:12 PM

నాణేలతో కార్లు, ద్విచక్రవాహనాలు కొనేందుకు వెళ్లడం వంటి వార్తలు చాలానే చూశాం. తులాభారం వంటి మొక్కులు చెల్లించేందుకు కూడా అనేక మంది భక్తులు.. నాణేల సంచులను గుడికి తీసుకు వెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కోర్టుకు.. నాణేల సంచులను తీసుకువెళ్లారు. వాటిని ఆయన ఒక్కరే లోపలికి మోసుకు వెళ్తూ ఉండగా.. పలువురు వీడియో తీశారు.

వాటిని నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఆయన ఆ నాణేలను కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి.. సొంతంగా ఓ కారు కొనుక్కుని మరీ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితమే ఆయన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు. మొదట్లో బాగానే ఉన్న ఈ జంట మధ్య తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆయన భార్య గతేడాది విడాకులు కావాలంటూ కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరినీ కలిపేందుకు కోర్టు చాలా సార్లే కౌన్సిలింగ్ ఇప్పించినా.. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేవు. దీంతో న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..

ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??