ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

Phani CH

|

Updated on: Dec 23, 2024 | 7:28 PM

దేశంలో ఎక్కువగా వినియోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఒకటి. ఓటీటీ ప్రయోజనాలతో పాటు షాపింగ్‌ బెన్‌ఫిట్స్‌ కూడా లభిస్తుండడంతో చాలామంది దీన్ని వినియోగిస్తుంటారు. చాలామంది ఒక అకౌంట్‌ తీసుకుని పలువురు ఈ సేవలను ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు సంబంధించి తన టర్మ్స్‌ను సవరించింది.

డివైజ్‌ల వాడకంపై పరిమితి విధించింది. ప్రస్తుతం ప్రైమ్‌ వీడియో యూజర్లు ఐదు డివైజులను ఒకేసారి వాడుకోవచ్చు. ఏ డివైజ్‌ అన్నది సంబంధం లేకుండా వీడియోలను చూడొచ్చు. అయితే, డివైజ్‌ల సంఖ్యను అలాగే ఉంచి.. టీవీల సంఖ్యపై అమెజాన్ పరిమితి విధించింది. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను వాడాల్సివస్తే కొత్త కనెక్షన్‌ తీసుకోవాలని తెలిపింది. జనవరి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని తెలిపింది. ఈ మేరకు యూజర్లకు ఇ-మెయిల్స్‌ పంపిస్తోంది. సెట్టింగ్స్‌ పేజీలోని మేనేజ్‌ ఆప్షన్‌ ద్వారా డివైజులను మేనేజ్‌ చేసుకోవచ్చని అమెజాన్‌ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్ వార్షిక మెంబర్‌షిప్ ధర రూ.1499గా ఉంది. త్రైమాసికానికైతే రూ.599, నెలకైతే రూ.299 చెల్లించాలి. ఈ మెంబర్‌షిప్‌తో ఎలాంటి ప్రకటనలూ లేకుండానే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించొచ్చు. ఏడాదికి రూ.799 చెల్లించి ప్రైమ్‌లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే సదుపాయం కూడా అందిస్తోంది. ఇందులో ప్రకటనలు వస్తాయి. స్ట్రీమింగ్‌తో సంబంధం లేకుండా కేవలం షాపింగ్‌ ప్రయోజనాలు మాత్రమే కోరుకునేవారు ఏడాదికి రూ.399 చెల్లించి షాపింగ్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌నూ తీసుకోవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..