హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం

హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం

Phani CH

|

Updated on: Dec 23, 2024 | 8:14 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది.

ఇప్పుడీ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన తొలిరోజు నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్‌ విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డులు బద్ధలుకొడుతున్న పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద తన హవా కొనసాగిస్తుంది. ముఖ్యంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో ‘పుష్ప-2’ చిత్రంతో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్‌ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2′ ది రూల్‌ ఆ ఘనతను దక్కించుకుంది. ఇప్పటి వరకు హాయ్యెస్ట్‌ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న’స్త్రీ2’ చిత్రం లైఫ్‌ టైమ్‌ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప-2 అధిగమించడం విశేషం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??

తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..

ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..