AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Papaya: ప‌చ్చి బొప్పాయిని తీసుకుంటే ఊహించ‌ని ఆరోగ్య లాభాలు మీ సొంతం..!

పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని క్లీన్ గా ఉంచుతుంది. మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్ లు కొవ్వు కరిగించడంలో సహకరిస్తాయి. పచ్చి బొప్పాయి చికాకు లేదా ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాపు, గొంతు ఇన్ ఫెక్షన్లు, శ్వాస కోశ

Raw Papaya: ప‌చ్చి బొప్పాయిని తీసుకుంటే ఊహించ‌ని ఆరోగ్య లాభాలు మీ సొంతం..!
Raw Papaya
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2024 | 8:45 PM

Share

పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు అనేక వ్యాధులను తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒక గిన్నె పచ్చి బొప్పాయిని తింటే, మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గిన్నె నిండా పచ్చి బొప్పాయిని ఒక నెల రోజులు తింటే పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బొప్పాయిలో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌తో పోరాడటానికి సహాయపడుతుంది, అదే సమయంలో చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. బొప్పాయిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మధుమేహం ఉన్నవారికి బొప్పాయిని ఒక గొప్ప ఆహారంగా మారుస్తుంది.

పచ్చి బొప్పాయిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఏ, సీ, ఈ, బీ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇంకా ఎంజైమ్ లు, ఫైటోన్యూట్రియెంట్ లు కూడా చాలానే ఉంటాయి. పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని క్లీన్ గా ఉంచుతుంది. మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్ లు కొవ్వు కరిగించడంలో సహకరిస్తాయి. పచ్చి బొప్పాయి చికాకు లేదా ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాపు, గొంతు ఇన్ ఫెక్షన్లు, శ్వాస కోశ ఇన్పెక్షన్ల భారీ నుంచి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

ఊపిరితిత్తులు మంట నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పచ్చి బొప్పాయిలో ప్రోటీజ్ ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలు త్వరగా మానడానికి కూడా అద్భుతంగా పని చేస్తాయి. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..