AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దంతం.. ఎవరిదంటే..

ప్రపంచంలో చిన్న చిన్నవి, అత్యంత ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. కానీ, ఈ రోజు మనం ఒక గొప్ప శాస్త్రవేత్త పంటి గురించి చెప్పబోతున్నాం..ఆయన పంటి విలువ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటే.. ఇది చాలా విలువైనది. ఆ పంటిని కొనుగోలు చేసిన వ్యక్తి దాన్ని ఒక రింగ్‌లో అమర్చి తయారు చేయించుకున్నాడు.. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దంతం.. ఎవరిదంటే..
Worlds Most Expensive Human Tooth
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2024 | 4:46 PM

Share

వజ్రల్లాంటి విలువైన వస్తువులు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే, మానవ దంతాల వంటి సాధారణమైన వస్తువు ఖరీదు ఎంతవరకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంటి ధర తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. ఈ పంటి ధరను ఎవరూ ఊహించలేరు కూడా.? ఆ పంటి ఖరీదు కొన్ని కోట్లు..! ఇంతకీ ఆ దంతం ఎవరిది..? ఎందుకు అంత ఖరీదు పలికిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలలో న్యూటన్ ఒకరు. న్యూటన్ అనేక సిద్ధాంతాలు నేటికీ గణితం, సైన్స్ ప్రాథమిక సూత్రాలుగా బోధించబడుతున్నాయి. అయితే ఈరోజు మనం సర్ ఐజాక్ న్యూటన్ దంతాల గురించి తెలుసుకుంటే.. 1816లో అతని పళ్ళలో ఒకటి లండన్‌లో $363కి విక్రయించబడింది. నేడు దాని ధర 36000 డాలర్లకు సమానం. ఇది 29 లక్షల భారతీయ రూపాయలకు సమానం. న్యూటన్ పంటికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దంతాల బిరుదు కూడా ఉంది. ఈ పంటిని ఒక రింగ్‌లో అమర్చారు. అత్యంత ఖరీదు ధరతో వేలంలో అమ్ముడుపోయిన న్యూటన్‌ పంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే గుర్తుకు వచ్చే పేరు సర్ ఐజాక్ న్యూటన్. యాపిల్ గురించి ఆయన చెప్పిన కథ ఎప్పటికీ మరిచిపోలేనిది. న్యూటన్ 1726లో మరణించాడు. 1816లో, సర్ ఐజాక్ న్యూటన్ పళ్ళలో ఒకటి లండన్‌లో USD 3,633కి విక్రయించబడింది. ఇది ఈరోజు USD 35,700 (సుమారు రూ. 30 లక్షలు)కి సమానం. ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన పంటిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. ఈ దంతాన్ని ముత్యంలా ఉంగరానికి అమర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..