Viral Video: ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్ ఇలా కూడా నడిపిస్తారా..? నెటిజన్లు ఫైర్..
కొందరు పోకిరీలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులు, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటిదే ఇక్కడో వ్యక్తి వెనుకకు కూర్చొని స్కూటీని నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతడు చేసిన పిచ్చి పనిపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వాహనాలు నడిపించే వ్యక్తుల గురించి తరచూ వార్తలు వింటూనే ఉంటారు. రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడపాలని అవగాహన కల్పించినా.. అవేవీ పట్టించుకోకకుండా కొందరు పోకిరీలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులు, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటిదే ఇక్కడో వ్యక్తి వెనుకకు కూర్చొని స్కూటీని నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతడు చేసిన పిచ్చి పనిపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివ్య కుమారి (divyaKumaari) తన X ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో క్యాప్షన్‌గా ఇలాంటి వారు చేసే పిచ్చి పనుల కారణంగా వారి ప్రాణాలతో పాటుగా ఇతర అమాయకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తారు అని క్యాప్షన్ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో, పసుపు రంగు టీ-షర్టు ధరించిన ఓ వ్యక్తి హైవేపై వెనుకకు కూర్చొని స్కూటర్ నడుపుతున్న షాకింగ్ దృశ్యాన్ని చూడవచ్చు.
వీడియో ఇక్కడ చూడండి..
कैसे कैसे बेवकूफ़ लोग है खुद तो मरते ही है साथ मे दूसरे लोगों कों भी परेशानी मे डालते है। 😳😳 pic.twitter.com/qGii3oHiaC
— दिव्या कुमारी (@divyakumaari) December 20, 2024
డిసెంబర్ 20న షేర్ చేసిన ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వీక్షించారు. అనేక కామెంట్లు వచ్చాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది నెటిజన్లు మండిపడ్డారు.
‘ ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయటం చట్టరీత్యా నేరం.. ! లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి విన్యాసాలు చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రజలు డిమాండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..