- Telugu News Photo Gallery Spiritual photos Andhra Pradesh: Srisailam temple to publish book based on copper plates found in temple
Srisailam Temple: శ్రీశైలం ఘంటామఠం పునరుద్ధరణలో బయటపడిన రాగిరేకులపై శ్రీశైలం ప్రాశస్త్యం.. త్వరలో పుస్తక ఆవిష్కరణ
భారతదేశంలో శక్తిపీఠాలకు జ్యోతిర్లింగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. జ్యోతిర్లింగం అన్న శక్తి పీఠం అన్న దర్శించి తరించేవారు ఎందరో. ఖండాంతరాలు దాటి వీటి దర్శనం కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. అలాంటి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది శ్రీశైలం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఒకే ప్రాంగణంలో ఉండడమే.
Updated on: Dec 24, 2024 | 11:58 AM

Srisailam Temple

శ్రీశైలం ఈవోగా రామారావు ఉన్నప్పుడు 2022 లో శ్రీశైలంలో ఉన్న పంచ మఠాల జీర్నోద్దారణ పనులు చేపట్టారు. అందులో ఒకటైన ఘంటా మఠం దగ్గర జీర్ణోదారణ పనులు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా చుట్టూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పనులు చేపట్టారు.

ఈ పనులలోనే బంగారు వెండి నాణేలతో పాటు 20 సెట్ల(72) రాగి శాసనాలు లభించాయి. వీటిని అందరి సమక్షంలో పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు శ్రీశైలం ఆలయ అధికారులు. వీటిపై పురావస్తు శాఖ సుదీర్ఘ అధ్యయనం చేసింది.

జిల్లాలో శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సమయంలో లభ్యమైన పురాతన (తామ్ర) రాగిరేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు

సుమారు 3 ఏళ్ల కిందట పంచమటాల పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు (మొత్తం 72), కొన్ని బంగారు నాణేలు దొరికాయి వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు.

12-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈరాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు శ్రీశైలం ఆలయ చరిత్రకు ఇవి కీలక ఆధారాలుగా చెబుతున్నారు.

ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరచారని ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తుశాఖ సంచాలకుడు (ఎపీగ్రఫీ) కె.మునిరత్నంరెడ్డి ఒక పుస్తకం రాశారు.

ఈ పుస్తకాన్ని తెలుగు ఆంగ్ల భాషలలో 250 పేజీలతో ముద్రిస్తున్నట్లు అతి త్వరలోనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం తెలిపారు.




