- Telugu News Photo Gallery Spiritual photos Guru Vakri 2025 These zodiac signs to benefit in big way details in telugu
Astrology 2025: గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
Guru Vakri 2025: వచ్చే ఏడాది మొదటి ఆరు నెలలు గురువు రెట్టింపు బలంతో శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. జనవరి 16 నుంచి గురువు వక్రగతి నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఫలితంగా మే 25న గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మారే వరకూ అత్యధిక బలంతో, అత్యధిక వేగంతో కొన్ని అనుకూల రాశులకు కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు చేసిన ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి, సొంత ఇంటి ప్రయత్నాలన్నీ క్రమంగా నెరవేరుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరరాశులవారికి ఈ మార్పు వల్ల తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. గురువు వల్ల జరగాల్సిన శుభ పరిణామాలన్నీ ఈ నాలుగు నెలల కాలంలో చకచకా జరిగిపోతాయి.
Updated on: Dec 24, 2024 | 7:33 PM

మేషం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు తన వక్ర సంచారానికి స్వస్తి చెప్పి రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆదాయ మార్గాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఆగిపో యిన ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికపరమైన కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పెళ్లి, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు జరుగుతాయి.

వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు పూర్తిగా చక్కబడ తాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తక్షణ స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాల వల్ల లబ్ధి పొందడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయే అవకాశం ఉంది. విదేశీయాన యోగం పడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి 11వ స్థానంలో ఉన్న గురువు వక్రగతి నుంచి బయటపడుతున్నందువల్ల పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. గృహ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువు వక్రగతి వీడుతున్నందువల్ల అనేక పర్యాయాలు ధన యోగాలు, భాగ్య యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పితృమూలక ధన లాభానికి ఆస్కారముంది. విదేశాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో అనేక శుభ కార్యాలు జరుగుతాయి.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న వక్ర గురువు రుజు మార్గంలోకి మళ్లడం వల్ల అవి వాహితుల్లో చాలామందికి తప్పకుండా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. విదే శీయానానికి మార్గం సుగమం అవుతుంది. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థి కంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో వక్రగతిలో ఉన్న గురువు రుజుమార్గం పడుతున్నందువల్ల ఇంట్లో ముఖ్యమైన శుభకార్యాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా సమర్థ తకు గుర్తింపు లభించడంతో పాటు ఉన్నత పదవులు లభిస్తాయి. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.



