సన్నజాజి తీగల మారి సెగలు రేపుతున్న ప్రణీత స్టన్నింగ్ లుక్స్

Phani CH

24 December 2024

ప్రణీత సుభాష్..  కన్నడలో 2010 లో మహేష్ బాబు కన్నడ రీమేక్ ‘పొర్కి’ సినిమాలో దర్శన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. 

ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగులో అగ్ర హీరోల సరసన నటించినా.. ఎందులో మెయిన్ హీరోయిన్‌గా కాకుండా సెకండ్ కథానాయికగానే ఈమెకు వరుస అవకాశాలొచ్చాయి.

దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ మలయాళంలో మాత్రం నటించలేదు. కానీ హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాలతో పకలరించింది. 

ప్రణీత సుభాష్ ఏది చేసినా సంచలనమే అని చెప్పాలి. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎపుడు ముందుంటుంది. ఒక్కొసారి సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు దొరికిపోతుంటుంది.

గతేడాది పెళ్లి పీఠలు ఎక్కి అభిమానులను ఆశ్యర్యపరిచింది. ఆ తర్వాత ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది.