పుచ్చకాయ కొనే ముందు ఇవి తెలుసుకోండి..

TV9 Telugu

24 December 2024

పుచ్చ‌కాయ ఎంత పెద్ద‌గా ఉంటే అంత బాగుంటుంద‌ని చాలామంది అపోహ ప‌డ‌తారు. కానీ అది నిజం కాదు.. పుచ్చ‌కాయ రుచికి దాని ప‌రిమాణానికి సంబంధం లేదు.

కాయ ఏ సైజ్‌లో ఉన్నా స‌రే.. ప‌ట్టుకున్న‌ప్పుడు బ‌రువుగా ఉండాలి. అలా బ‌రువుగా ఉంటే కాయ లోప‌ల నీళ్లు, గుజ్జు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

చాలామంది ప‌చ్చ‌గా క‌నిపించే పుచ్చ‌కాయ‌ల‌ను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ అలాంటి కాయ‌లు పూర్తిగా పండ‌క‌.. చ‌ప్ప‌గా అనిపిస్తుంటాయి.

పుచ్చ‌కాయ తొడిమ‌ను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయిన‌ట్లు ఉంటే ఆ కాయ బాగా పండింద‌ని అర్థం.

మీరు పుచ్చ‌కాయ‌ను కొనేముందు దానిపై వేళ్ల‌తో కొట్ట‌డం ద్వారా ఆ కాయ ఎలాంటిదో పండిందో లేదో తెలుసుకోవచ్చు.

గుల్ల‌లా ట‌క్ ట‌క్ అని శ‌బ్దం వ‌స్తే ఆ కాయ బాగా పండింద‌ని చెప్పొచ్చు. అదే శ‌బ్దం రాక‌పోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉంద‌ని అర్థం.

మీరు పుచ్చ‌కాయ‌ను కొనేటప్పుడు ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకుని వాస‌న చూసిన‌ప్పుడు తియ్య‌టి వాస‌న వ‌స్తుంది.

మ‌రి తియ్య‌గా వ‌స్తే మాత్రం ఆ కాయ‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి.. మురిగిపోయేందుకు ద‌గ్గ‌ర‌లో ఉంద‌న్న‌మాట‌.