AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారి హోదా పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇలా ఉన్నాయ్..

ఆగస్టు 17, 2026 సోమవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది? ఎవరి ఆదాయం పెరుగుతుంది? ఎవరికి పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి? ఏ రాశుల వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, వివాహం, ఆరోగ్యం తదితర అంశాలపై నేటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

Horoscope Today: ఆ రాశుల వారి హోదా పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇలా ఉన్నాయ్..
Daily Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 6:59 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 17, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. వృషభం రాశి వారి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. మిథునం రాశి వారికి రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా బాధ్యతల్ని పూర్తి చేస్తారు. అయితే.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొన్ని వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, లావాదేవీలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కార్య సిద్ధి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల విషయంలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఏ రంగానికి చెందిన వారికైనా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి సానుకూల స్పందన లభి స్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి హోదా పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగాసాగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభ పరి ణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామికి సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే సూచనలున్నాయి. అన వసర పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విలాసాల మీద బాగా ఖర్చు చేసే అవకాశముంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యల పరిష్కారంలో పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల వల్ల కష్టనష్టాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. వ్యాపారాల్లో ఏ ప్రయత్నం తలపెట్టినా సకాలంలో పూర్తయి సత్ఫలితాలనిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికిలోటుండకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదలకు అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం ఆశాజ నకంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బంది పడ తారు. ఇంటా బయటా మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి.

Follow Us
అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ
అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?
నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?
వాళ్లలా రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడతా
వాళ్లలా రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడతా
13 అడుగుల పొడవు.. 6.5 కిలోల బరువు.. పశువుల కొట్టంలో దూరి హల్చల్!
13 అడుగుల పొడవు.. 6.5 కిలోల బరువు.. పశువుల కొట్టంలో దూరి హల్చల్!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో
ఆసీస్‌‌తోపాటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్?
ఆసీస్‌‌తోపాటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్?
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!