Gold Price: మళ్లీ ఊహించని మార్పులు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో
బంగారం ధరలు మరోసారి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తగ్గిన ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 17 ఉదయం నమోదైన రేట్ల ప్రకారం... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గోల్డ్ ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. వారంలోనే రూ.3వేలకు పైగా ధర పెరిగింది. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా సోమవారం (ఆగస్టు 17) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,55,120 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి రూ.1,42,190 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,49,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,120, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,270, 22 క్యారెట్ల ధర రూ.1,42,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,270, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,120, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,120, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
