- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu one who understands these 4 mantras of acharya he will learn to solve the problem before it comes
Chanakya Niti: ఈ 4 విషయాలను జీవితంలో ఆచరించే వ్యక్తి.. ఎన్నడూ సమస్యల బారిన పడడంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి అపరమేథావిగా కీర్తిగాంచాడు. వందేళ్ల కిందట ఆచార్య చెప్పిన ఎన్నో విషయాలు నేటి కంప్యూటర్ యుగంలోనూ నిజమని నిరూపిస్తున్నాయి. నేటి కాలంలో ప్రజలు ఆచార్యను గొప్ప పండితుడిగా పరిగణిస్తారు. మిమ్మల్ని రక్షించడంలో ఆచార్య చెప్పిన 4 విషయాలు సహాయపడతాయి.
Updated on: Aug 05, 2022 | 4:46 PM

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.





























