Actress: వీడియో సెక్స్ చేయమని వేధిస్తున్నాడు.. పోలీసులకు ఆశ్రయించిన ప్రముఖ నటి..

Actress: టీవీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Actress: వీడియో సెక్స్ చేయమని వేధిస్తున్నాడు.. పోలీసులకు ఆశ్రయించిన ప్రముఖ నటి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 15, 2022 | 10:06 PM

Actress: టీవీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. గుర్తు తెలియని వ్యక్తి వీడియో సెక్స్ చేయాలంటూ తనను వేధిస్తున్నాడని, అతని గురించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరే ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన గోడును సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకుంది.

సదరు వ్యక్తి వేధింపులకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను, సుదీర్ఘమైన మ్యాటర్‌ను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది ఉర్ఫీ జావేద్. మార్ఫింగ్ చేసిన తన ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ విలపించింది. ‘‘ఓ వ్యక్తి నన్ను చాలా కాలంగా వేధిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ చేశారు. అది అప్పుడే నా దృష్టికి రాగా, పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో నేను నరకం అనుభవించాను. ఇప్పుడు ఆ మార్ఫింగ్ ఫోటోను పట్టుకుని ఓ వ్యక్తి వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే ఆ ఫోటోను రకరకాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరిస్తున్నాడు.’’ అని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలాఉంటే.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయింది. ‘‘అతని విషయంలో కంటే.. పోలీసులు వ్యహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. 1వ తేదీన ముంబైలోని గోరెగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 14 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపట్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబై పోలీసుల గురించి చాలా మంచి విషయాలు విన్నాను కానీ, ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి విచిత్రంగా ఉంది. అతను ఎంత మంది మహిళలలను ఇలా వేధింపులకు గురి చేశాడో ఆధారాలతో సహా తెలియజేసినప్పటికీ, ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ వ్యక్తి సమాజానికి, ముఖ్యంగా మహిళలకు చాలా ప్రమాదకరం. స్వేచ్ఛగా జీవించడానికి అతను అర్హుడు కాదు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు గానీ, అతను మాత్రం స్వేచ్ఛగా సంచరిస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు’’ అని పేర్కొంది.

ఉర్ఫీ జావేద్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది. తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసి, నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కు విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ లోనూ పాల్గొంది.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ