- Telugu News Photo Gallery Science photos Viral News Macaques are Pleasuring Themselves with Stone Sex Toys in Bali
Viral News: ఈ దేశంలోని కోతులకు రాళ్లంటే తెగ ఇష్టమట.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..
Viral News: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కోతుల జాతి మకాక్ అని అంటారు. ఇండోనేషియాలో ఈ జాతి కోతులు అధికంగా ఉంటాయి. ఇక్కడి కోతులకు తెలివి కొంచెం ఎక్కువేనని అంటారు.
Updated on: Aug 17, 2022 | 7:32 PM

Viral News: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కోతుల జాతి మకాక్ అని అంటారు. ఇండోనేషియాలో ఈ జాతి కోతులు అధికంగా ఉంటాయి. ఇక్కడి కోతులకు తెలివి కొంచెం ఎక్కువేనని అంటారు. అంతేకాదు.. ఇక్కడి కోతులు మనుషుల మాదిరిగానే సెక్స్ టాయ్‌లను ఉపయోగిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రకృతిలో భాగమైన కోతులు.. ప్రకృతిలో లభించే రాళ్లనే సెక్స్ టాయ్‌లుగా ఉపయోగిస్తాయట. కెనడియన్ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. సెంట్రల్ బాలి అడవుల్లో నివసించే కోతులలో ఇది కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మగ, ఆడ కోతులు రెండూ రాళ్లను సెక్స్ టాయ్‌లుగా ఉపయోగిస్తాయట.

పొడవాటి తోక ఉన్న ఈ కోతులు జననాంగాలను రాళ్లతో రాపిడీ చేస్తాయని కెనడాలోని లీత్‌బ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీరు విడుదల చేసిన నివేదిక ప్రకారం, మగ, ఆడ కోతులు రెండూ రాళ్లను సెక్స్ టాయ్‌లుగా ఉపయోగిస్తాయి. అయితే ఈ ప్రవర్తన ఆడ కోతులకంటే మగ కోతులలో ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే, కోతులు ఎలాంటి రాళ్లను ఎక్కువగా ఉపయోగిస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు. గరుకుగా ఉండే అంచులు లేదా కోణీయ ఆకారంలో ఉండే రాళ్లను అవి ఉపయోగిస్తాయని పరిశోధనలో తేల్చారు. మగ, ఆడ కోతులు రాళ్ల సాయంతో లైంగిక ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 2016, 2020 మధ్య వీటిపై పరిశోధనలు జరిపారు. అవి సంచరించే ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి.. ఆ కోతులు ప్రవర్తిస్తున్న తీరును పరిశీలించారు.

అయితే, కోతులు ఇలా చేయడం కొత్త విషయమేమీ కాదని పరిశోధకులు అంటున్నారు. కోతులు చాలా కాలంగా లైంగిక సంతృప్తి కోసం మానవ నిర్మిత వస్తువులను సైతం ఉపయోగిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు.

పూర్వకాలంలో వేటకు ఆయుధాలుగా ఉపయోగించిన రాళ్లను అడవి కోతులఉ ఉపయోగించుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దానిని క్రమంగా సెక్స్ టాయ్‌గా ఉపయోగించడం ప్రారంభించాయని, ఈ ప్రవర్తన క్రమంగా తరువాతి తరానికి సంక్రమించిందని పరిశోధనలో పేర్కొన్నారు.





























