Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male fertility: టాప్ సీక్రేట్.. ఆ విషయంలో మహిళల్లాగే పురుషులకూ ఓ సమయం ఉంటుంది..!

Male fertility: వైద్య పరిభాష ప్రకారం.. మహిళలకు పీరియడ్స్ వచ్చిన తరువాత స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే సంతానం కలుగుతుంది. ప్రతీ వైద్యులు ఇదే విషయాన్ని..

Male fertility: టాప్ సీక్రేట్.. ఆ విషయంలో మహిళల్లాగే పురుషులకూ ఓ సమయం ఉంటుంది..!
Male Fertility
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2022 | 10:25 PM

Male fertility: వైద్య పరిభాష ప్రకారం.. మహిళలకు పీరియడ్స్ వచ్చిన తరువాత స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే సంతానం కలుగుతుంది. ప్రతీ వైద్యులు ఇదే విషయాన్ని చెషయాన్ని చెబుతారు. పీరియడ్స్‌ను రుతుక్రమం అని అంటారు. అయితే, మహిళల్లో మాత్రమే కాదు.. పురుషుల్లోనూ ఈ బయోలాజికల్ క్లాక్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై అందరికీ పెద్దగా అవగాహన లేకపోవచ్చు గానీ, ఇది నిజం. పురుషుల్లో ఒక ఏజ్ వరకు ఈ బయోలాజిక్ క్లాక్ పని చేస్తుంది. అంటే.. ఒక సమయంలోగా పెళ్లి చేసుకుని, కాపురం చేస్తే పిల్లలు పుడుతారని అర్థం. 1970లలో సగటున పురుషులు 29 సంవత్సరాలలోపు పెళ్లి చేసుకుంటే వారి పిల్లలు పుడతారు. లేదంటే.. సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుత నివేదికల ప్రకారం ఇప్పుడది 34 సంవత్సరాలకు పెరిగింది. ఈ అధ్యయనాల నివేదికలను ఖచ్చితంగా నిర్ధారించలేనప్పటికీ.. సగటున 34 సంవత్సరాల వయసు వరకు సంతానోత్పత్తి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత వయసు వారిలో సంతానోత్పత్తికి సంబంధించి సమస్యలు తలెత్తొచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

ఇక మహిళలకు 20 నుంచి 30 ఏళ్ల లోపు సంతానోత్పత్తి విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తరువాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వయసుల వారు చాలా మంది ఇప్పటికే వైద్యులను సంప్రదించడం జరుగుతుంది. అయితే, ఈ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుదల కేవలం మహిళల్లో మాత్రమే ఉంటుందని, పురుషుల్లో ఉండదని చాలా మంది భావిస్తారు. కానీ, వైద్యులు ఆ భావనను కొట్టిపాడేస్తున్నారు. పురుషులకు కూడా వయసు పెరుగుతున్నా కొద్ది సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఈ విషయాన్ని ధృవీకరించారు ప్రముఖ ప్రసూతి, గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మంజీరి మెహతా. ‘‘అవును, పురుషులకు కూడా జీవ గడియారం(బయోలాజిక్ క్లాక్) ఉంటుంది. అయితే, పురుషులు స్పెర్మ్ ఉత్పత్తిని కొనసాగించడం వలన చాలా మందికి దీని గురించి తెలియదు. స్త్రీలు పరిమిత సంఖ్యలో అండోత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటారు. పురుషులు వయస్సుతో సంబంధం లేకుండా స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. అయితే, వారు గ్రహించని విషయం ఏమిటంటే వయస్సుతో పాటు స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుంది. నాణ్యతాలోపంతో కూడిన స్పెర్మ్‌ల సంఖ్య పెరుగుతుంది. అలాగే, టెస్టోస్టెరాన్ స్థాయి, వృషణాలలో తయారయ్యే మేల్ సెక్స్ హార్మోన్ స్థాయి కూడా పడిపోతుంది.’’ అని వివరించారు.

ఇతర సమస్యలు కూడా.. ప్రస్తుత కాలంలో ప్రజల జీవితం చాలా ఒత్తిడితో కూడుకుని ఉంది. వయస్సు పెరిగే కొద్ది బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్ వంటి కొమొర్బిడిటీలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను, లిబిడోపై ప్రభావం చూపుతాయి. అంగస్తంభనకు కూడా దారి తీయొచ్చు. అందుకే.. పురుషులు 35 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనివ్వడం ఉత్తమమైన సమయం అని డాక్టర్ మెహతా పేర్కొన్నారు. లేదంటే, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

పిల్లలకు అంగవైకల్యం.. కొచ్చిలోని అమృతా హాస్పిటల్‌లోని అమృత ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫెస్సీ లూయిస్ టి మాట్లాడుతూ.. పురుషులు 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే.. ఆ పుట్టే పిల్లల్లో కొంత వైకల్యం ఉండే అవకాశం ఉందన్నారు. వారి ఎదుగుదలలో తేడా ఉంటుందన్నారు. అలాగే కొందరికి పిల్లలు పుట్టే విషయంలో సమస్యలు కూడా ఎదురవ్వొచ్చన్నారు.

సంతానోత్పత్తిలో సమస్యల లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? 1. ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. రోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. 2. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. 3. విటమిన్ సి, విటమిన్ డి 3, జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. 4. సోయాను ఎక్కువగా తినకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..