Home Remedies: ఈ 5 పదార్థాలు తీసుకుంటే నిమిషాల్లోనే మలబద్ధకం నుంచి ఉపశమనం..!

Home Remedies: ప్రస్తుత కాలంలో ఎసిడిటీ లాగే మలబద్ధకం కూడా సాధారణ సమస్యగా మారింది. మలబద్దకానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇందులో సమయానికి ఆహారం తీసుకోకపోవడం

Home Remedies: ఈ 5 పదార్థాలు తీసుకుంటే నిమిషాల్లోనే మలబద్ధకం నుంచి ఉపశమనం..!
Health Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2022 | 10:16 PM

Home Remedies: ప్రస్తుత కాలంలో ఎసిడిటీ లాగే మలబద్ధకం కూడా సాధారణ సమస్యగా మారింది. మలబద్దకానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇందులో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిపడా నీళ్లు తాగకపోవడం, ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువగా తినడం, తిన్న తర్వాత ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, పెయిన్ కిల్లర్ లాంటి మందు వాడటం వంటివి. అయితే, మలబద్ధకం సమస్య నుండి దూరంగా ఉండటానికి.. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం చాలా ముఖ్యం. అలాగే తగినంత నీరు త్రాగాలి. మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా 5 పదార్థాలు తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అత్తి పండ్లు.. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తీసుకోవాలి. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. దీనిని తినడం వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

సబ్జా విత్తనాలు.. రాత్రి 2 నుండి 3 చెంచాల సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ గింజలను తినాలి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యి.. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది ప్రేగులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ నెయ్యి కలపాలి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కూడా దీనిని తాగొచ్చు. దీని వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రేగు పండ్లు.. రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో భేదిమందు గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. రాత్రిపూట నానబెట్టిన 2 రేగు పండ్లను ఉదయం తింటే.. మంచి ఫలితాలు ఉంటాయి.

ఇసాబ్గోల్.. ఇసాబ్గోల్‌లో బేధిమందు లక్షణాలు ఉన్నాయి. ఇసాబ్గోల్ కలిపిన ఒక గ్లాసు నీరు తాగితే.. మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 1 నుండి 2 సార్లు దీనిని తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఆ లింక్ క్లిక్ చేయండి..