Women Health: పీరియడ్స్ సమయంలో తీవ్ర నొప్పి వేధిస్తోంది.. ఈ టిప్స్‌తో ఉపశమనం పొందండి..
Women Health: ఋతుస్రావం సమయంలో మహిళలలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ఇది సర్వసాధారణం. ఒక్కోసారి లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది.
Women Health: ఋతుస్రావం సమయంలో మహిళలలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ఇది సర్వసాధారణం. ఒక్కోసారి లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు మందులు తీసుకుంటారు. అయితే, ఆ మందులు సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణం అవుతుంది. ఆరోగ్యానికి హానీ చేస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లో నిత్యం వినియోగించే కొన్ని వస్తువులే అద్భుత ఔషధంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిని వినియోగించడం ద్వారా రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు. మరి ఆ ఉపశమన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క.. దాల్చిన చెక్కను మనం తినే ఆహారం వేసుకుంటాం. దీనిని పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా తీసుకోవచ్చు. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పిగా ఉంటే.. దాల్చిన చెక్క పొడిని, టీ గానీ, కాఫీలో గానీ వేసుకుని తాగొచ్చు.
అల్లం.. అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ కూడా తాగొచ్చు. అయితే, పాలలో వేసుకుని మాత్రం తాగొద్దు. ఒక కప్పు నీటిని తీసుకుని అందులో కొంత అల్లం ముక్క వేసి మరిగించాలి. ఆ తరువాత కొంత నిమ్మరసం వేసి మళ్లీ మరిగించాలి. ఆ మిశ్రమంలో కొంత తేనెను వేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తాగితే.. పీరియడ్స్ సమయంలో వచ్చే నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెంతులు.. మెంతి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం పొందడంలోనూ సహాయపడుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందుకోసం.. ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ గింజలు నానబెట్టిన నీటిని తాగాలి. మరీ చేదుగా అనిపిస్తే అందులో చిటికెడు ఉప్పు వేసుకుని తాగొచ్చు.
అవిసె గింజలు.. అవిసె గింజల రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరో విధంగా కూడా దీనిని తీసుకోవచ్చు. 2 కప్పుల నీటిలో 2 చిటికెల అవిసె గింజను వేసి మరిగించాలి. దానిని ఒడపట్టి.. ఆ నీటిలో తేనె కలుపుకుని తాగాలి. రోజుకు మూడుసార్లు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..