Cough: దగ్గు, గొంతులో నొప్పి, మంటతోపాటు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే.. దాని సంకేతం ఇదే కావొచ్చు..

అలెర్జీ దగ్గు లక్షణాలు ఏమిటీ..? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Cough: దగ్గు, గొంతులో నొప్పి, మంటతోపాటు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే.. దాని సంకేతం ఇదే కావొచ్చు..
Cough
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 9:47 PM

Allergic Cough: మారుతున్న వాతావరణంతోపాటు పలు సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ముఖ్యంగా ఇన్ఫెక్షన్, వైరల్ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అందులో సర్వసాధారణం అలెర్జీ సమస్యలు. దీని కారణంగా జలుబు, దగ్గు వస్తుంది. కానీ మనలో చాలా మంది అలర్జీ వల్ల వస్తుందన్న విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేరు. కొన్ని అలర్జీల కారణంగా జలుబు, దగ్గు సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వీటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా దగ్గు సమస్య పెరిగితే.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. దగ్గులో చాలా రకాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అలెర్జీ దగ్గు లక్షణాలు ఏమిటీ..? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అలెర్జీ దగ్గు లక్షణాలు

దగ్గు, గొంతులో దురద, గొంతు నొప్పి, గొంతు మంట, ముక్కు, చెవులలో దురద, ముక్కు కారడం, ముక్కులో మంట, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు, నోటి, పెదవుల సమస్యలు, వాంతులు, ఛాతీలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

అలెర్జీ దగ్గును తగ్గించుకోవడానికి హోం రెమెడిస్..

మెంతి గింజల నీరు తాగండి: ఈ సమయంలో మెంతి నీటిని తాగితే.. ఛాతీ నుంచి శ్లేష్మం తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతి గింజలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దగ్గు చికిత్సలో, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాలానుగుణ జలుబు, దగ్గును త్వరగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక చెంచా మెంతి గింజలను ఉడకబెట్టి దానిని ఫిల్టర్ చేసి సిప్ చేస్తూ తాగాలి. రోజుకు 2 సార్లు తాగితే అలర్జీ దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

వాము నీరు తాగండి: వాము వాటర్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఇది గొంతు, ఛాతీకి మంచి కంప్రెస్‌లను అందిస్తుంది. ఇంకా, కఫం తగ్గుతుంది. దీనికోసం అర టీస్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో మరిగించి రోజుకు 3 సార్లు తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!