Soda Side Effects: కడుపు ఉబ్బరంగా ఉందని సోడా తాగుతున్నారా..? అయితే.. ఆ వ్యాధుల బారిన పడినట్లే..

కొంతమంది సోడాను ప్రతిరోజూ తీసుకుంటారు. రాత్రి భోజనం తర్వాత సోడా తాగడం తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. ఇంకొంత మంది మద్యంలో కూడా కలుపుకుంటారు. అయితే సోడా తీసుకోవడం..

Soda Side Effects: కడుపు ఉబ్బరంగా ఉందని సోడా తాగుతున్నారా..? అయితే.. ఆ వ్యాధుల బారిన పడినట్లే..
Soda
Follow us

|

Updated on: Aug 15, 2022 | 9:16 PM

Soda Side Effects: ఎక్కువ తిన్నప్పుడు, గ్యాస్, కడుపు ఉబ్బరం అనిపించినప్పుడు చాలామంది సోడా నీటిని తాగుతారు. దీనితో కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. ఇలా, అప్పుడప్పుడు సోడా వాటర్ తీసుకుంటే పర్వాలేదు కానీ.. రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది సోడాను ప్రతిరోజూ తీసుకుంటారు. రాత్రి భోజనం తర్వాత సోడా తాగడం తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. ఇంకొంత మంది మద్యంలో కూడా కలుపుకుంటారు. అయితే సోడా తీసుకోవడం.. ఆరోగ్యానికి చాలా హానికరం అన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి.

రోజూ సోడా తీసుకోవడం వల్ల మీ శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. సోడా తాగడం వల్ల కలిగే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సోడా తాగడం వల్ల కలిగే నష్టాలు

ఇవి కూడా చదవండి

ఆస్తమాని ప్రేరేపిస్తాయి: ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.

ఎముకలు బలహీనం అవుతాయి: రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. ఎందుకంటే సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. కావున సోడా వినియోగానికి దూరంగా ఉండాలి.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు.

గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు. అందువల్ల దాని వినియోగానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..