ఆ వ్యసనాన్ని వదులుకోవడం అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ కష్టమట.. తాజా సర్వేలో సంచలన విషయాలు..

సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో అందరూ బిబీబిజీగా గడుపుతున్నారు. ఇవి ప్రస్తుతం చాలామంది వ్యసనంగా మారాయి.

ఆ వ్యసనాన్ని వదులుకోవడం అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ కష్టమట.. తాజా సర్వేలో సంచలన విషయాలు..
Social Media
Follow us

|

Updated on: Aug 15, 2022 | 3:37 PM

Social Media Addiction: ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. సమాచారాన్ని పంచుకోవడంతోపాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఎక్కువ మోజుతో మొబైల్.. జీవితంలో అత్యవసర సాధానంగా మారింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో అందరూ బిబీబిజీగా గడుపుతున్నారు. ఇవి ప్రస్తుతం చాలామంది వ్యసనంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.. సోషల్ మీడియా ప్రత్యేకంగా ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను వదులుకునే విషయంలో.. అబ్బాయిల కంటే అమ్మాయిలే కష్టమంటూ పేర్కొన్నారని ఓ సర్వే వెల్లడించింది.

యుఎస్‌లోని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. టీనేజ్ అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వదిలివేయడం కష్టమని కరాఖండిగా చెప్పారని పేర్కొంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ విషయంలో ఎక్కువగా అభ్యంతరం తెలిపారు. సోషల్ మీడియాను వదులుకోవాలనే ఆలోచన గురించి అడిగినప్పుడు 54 శాతం మంది టీనేజ్‌లు దానిని వదులుకోవడం కొంత కష్టమని పేర్కొన్నారు. మిగిలిన 46 శాతం మంది కనీసం కొంతవరకు హాయిగా ఉంటుందని సమాధానం చెప్పారు.

అమ్మాయిలే ఎక్కువ..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా (58 శాతం vs 49 శాతం) వదలడం కష్టం అని వ్యక్తంచేసిన వారిలో టీనేజ్ అబ్బాయిల కంటే టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారని అని సర్వే ఫలితాలు చూపించాయి. దీనికి విరుద్ధంగా టీనేజ్ అబ్బాయిలలో నాలుగింట ఒక వంతు మంది సోషల్ మీడియాను వదులుకోవడం చాలా సులభం అని పేర్కొన్నారు. అయితే 15 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు అదే చెప్పారు.

“యువత అందరూ కూడా సోషల్ మీడియాను వదులుకోవడం చాలా కష్టమని అంటున్నారు. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పది మందిలో ఆరుగురు టీనేజ్‌లు సోషల్ మీడియాను వదులుకోవడం కనీసం కొంత కష్టమైన పని అని అంటున్నారు. 13 నుంచి 14 సంవత్సరాల వారు కూడా ఇది కష్టమని భావిస్తున్నారు” అని సర్వే వెల్లడించింది.

సాధారణంగా సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని ప్రతిబింబించేటప్పుడు US యువకులలో ఎక్కువ మంది (55 శాతం) వారు ఈ యాప్‌లు, సైట్‌లలో సరైన సమయాన్ని వెచ్చిస్తున్నారని చెప్పారు, అయితే టీనేజ్‌లలో మూడవ వంతు (36 శాతం) సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారని అంటున్నారు.

కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు అతీతంగా మెజారిటీ యువకులు స్మార్ట్‌ఫోన్‌లు (95 శాతం), డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు (90 శాతం), గేమింగ్ కన్సోల్‌లు (80 శాతం) వంటి డిజిటల్ పరికరాలకు యాక్సెస్ కలిగి ఉన్నారు.

రోజువారీ టీనేజ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2014-15లో 92 శాతం నుంచి నేడు 97 శాతానికి పెరిగిందని అధ్యయనం చూపిస్తుంది. అదనంగా, 2014-15 నుండి దాదాపు నిరంతరం ఆన్‌లైన్‌లో ఉన్నామని చెప్పే టీనేజ్‌ల సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది.

గత ఎనిమిదేళ్లలో స్మార్ట్‌ఫోన్‌లకు టీనేజ్‌ల యాక్సెస్ పెరిగినప్పటికీ, డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్లు లేదా గేమింగ్ కన్సోల్‌ల వంటి ఇతర డిజిటల్ టెక్నాలజీలకు వారి యాక్సెస్ గణాంకపరంగా ఎటువంటి మార్పు లేకుండానే ఉందని సర్వే తెలిపింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం