Bihar: యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన

బీహార్ లో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని

Bihar: యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన
Nitish Kumar Tejaswi Yadav
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 15, 2022 | 2:16 PM

Bihar: బీహార్ లో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ ఈప్రకటన చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్జేడీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన 10 లక్షల ఉద్యోగాల హామీకి మద్దతిస్తూ.. నితీష్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం, పది లక్షల ఉద్యోగాల సంఖ్యను 20 లక్షలకు తీసుకెళ్తామన్నారు. బీహార్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన తర్వాత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. ఇది చారిత్రాత్మకమైన రోజని.. చారిత్రాత్మక ప్రదేశం నుండి ముఖ్యమంత్రి యువత భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారన్నారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వివిధ రంగాల్లో మరో 10 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన దిశగా కృషిచేస్తుంది. తన హామీకి మద్దతిస్తూ కీలక ప్రకటన చేసిన సీఎం నితీష్ కుమార్ కు తేజస్వి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది యువత విజయంమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని అమలుచేయకపోవడానికి తమది బీజేపీ పార్టీ కాదని.. ఇచ్చిన హామీని అమలుచేసి తీరుతామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్