Viral Video: ఫ్రెండ్స్‌కు దుమ్ములేచిపోయే బ్రేకప్ పార్టీ ఇచ్చిన యువకుడు.. దేనితో కేక్ కట్ చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్

ఒక విషాదకరమైన భోజ్‌పురి పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. అంతే కాదు వేడుకను చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాతో పాటు బెస్ట్‌ డెకరేషన్‌, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మంచి విందు భోజనంతో పాటు..

Viral Video: ఫ్రెండ్స్‌కు దుమ్ములేచిపోయే బ్రేకప్ పార్టీ ఇచ్చిన యువకుడు.. దేనితో కేక్ కట్ చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్
Breakup Party
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2022 | 1:49 PM

Viral Video: బ్రేకప్‌లు కష్టతరమైనవి..అలాంటి వారి జీవితాన్ని గందరగోళంగా మార్చేస్తుంటాయి. బాధితులు తీవ్ర నిరాశకు గురవుతారు. చాలా మంది వ్యక్తులు ఏడుస్తూ ఉండిపోతారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతుంటారు. మరికొంత మంది మద్యానికి బానిసవుతుంటారు. అయితే, ఇక్కడ తమను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తిని తగిన బుద్ది చెబుతాం అన్నట్టుగా  బ్రేకప్ పార్టీలు జరుపుకుంటున్నారు కొందరు యువకులు.  బీహార్‌లోని సమస్తిపూర్ నుండి అలాంటి వీడియో ఒకటి బయటపడింది. అందులో ఒక యువకుడు తన బాధను తగ్గించుకోవడానికి బ్రేకప్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఓ యువకుడు పిస్టల్‌తో కేక్ కట్ చేస్తున్నాడు.

ఈ వీడియో సమస్తిపూర్ జిల్లాలోని విద్యాపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణియార్‌పూర్ గ్రామంలో రికార్డ్ చేయబడింది. వీడియోని బట్టి చూస్తే.. ఇక్కడ అమిత్ అనే యువకుడి లవ్ బ్రేకప్ అయినట్టుగా తెలుస్తోంది. వీడియోలో కేక్‌పై ‘అమిత్ నిషా బ్రేకప్ డే’ అని కూడా వ్రాయబడి ఉంది. ఒక విషాదకరమైన భోజ్‌పురి పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. అంతే కాదు వేడుకను చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాతో పాటు బెస్ట్‌ డెకరేషన్‌, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మంచి విందు భోజనం,మద్యపానం, కూల్‌డ్రింక్స్‌ కూడా ఇస్తున్నారు. వచ్చిన స్నేహితులు, బంధువులు బహుమతులు కూడా ఇస్తున్నారు.  ఆ వ్యక్తి స్నేహితులు ఫోటోలు తీస్తుండగా, పిస్టల్ ఊపుతూ వారితో పోజులిచ్చారు. అక్కడున్న వారు సైతం తనతో పాటు డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి