AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: వంతెనపై నుంచి పరుగులు పెడుతున్న రైలు.. వేగంగా బిల్డింగ్ లోకి దూసుకెళ్లి.. కట్ చేస్తే

ప్రజా రవాణాలో రైల్వే వ్యవస్థ (Railways) అత్యంత కీలకం. రోడ్డు వ్యవస్థ తర్వాత అధిక మొత్తంలో ప్రయాణికులు రైళ్ల ద్వారానే జర్నీ చేస్తున్నారు. సాధారణంగా రైలు పట్టాలు మానవ నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. ఎటువంటి..

Video Viral: వంతెనపై నుంచి పరుగులు పెడుతున్న రైలు.. వేగంగా బిల్డింగ్ లోకి దూసుకెళ్లి.. కట్ చేస్తే
Train Video Vrial
Ganesh Mudavath
|

Updated on: Aug 15, 2022 | 1:15 PM

Share

ప్రజా రవాణాలో రైల్వే వ్యవస్థ (Railways) అత్యంత కీలకం. రోడ్డు వ్యవస్థ తర్వాత అధిక మొత్తంలో ప్రయాణికులు రైళ్ల ద్వారానే జర్నీ చేస్తున్నారు. సాధారణంగా రైలు పట్టాలు మానవ నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాకులను జనావాసాలకు దూరంగా నిర్మిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. కానీ చైనా లో మాత్రం ఓ రైలు నివాస సముదాయానికి దూరంగా కాకుండా.. ఓ అపార్ట్మెంట్ లోపలి నుంచి చుక్ చుక్ మంటూ పరుగులు పెడుతుంది. ఈ వీడియో చూశాక కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఎత్తైన వంతెన గుండా వెళుతున్న రైలు అకస్మాత్తుగా 6-7 అంతస్తుల భవనంలోకి ప్రవేశించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ రైల్వే ట్రాక్ చైనాలోని చాంగ్‌కింగ్‌లోని ఎత్తైన భవనం నుంచి సాగుతుంది. ఎక్కువ ఎత్తులో ఉండే భవనాల కారణంగా ఈ నగరాన్ని ‘మౌంట్ సిటీ’ అని పిలుస్తారు. ఈ ప్రాంతం చైనాలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి. ఇక్కడి జనాభా 30 మిలియన్ల కంటే అధికంగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

విశేషమేమిటంటే.. రైలు వెళ్లినప్పుడు ఆ భవనంలో నివసించే వారికి దాని శబ్దం కూడా వినిపించదు. ఈ రైలు వీడియో @wowinteresting8 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల 58 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై