Telugu News Trending The incident of riding a bicycle on a person lying on the road has gone viral on social media Telugu News
Video Viral: రోడ్డుపై పడుకున్న వ్యక్తి.. వేగంగా దూసుకొచ్చిన సైకిల్.. కట్ చేస్తే
ఇంటర్నెట్ (Internet) లో స్టంట్స్ కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని వామ్మో అనిపిస్తాయి. వారు స్టంట్స్ చేస్తుంటే ఇక్కడ ఏదో అయిపోతున్న ఫీల్ మనలో కలుగుతుంది....
ఇంటర్నెట్ (Internet) లో స్టంట్స్ కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని వామ్మో అనిపిస్తాయి. వారు స్టంట్స్ చేస్తుంటే ఇక్కడ ఏదో అయిపోతున్న ఫీల్ మనలో కలుగుతుంది. అలాంటి వీడియోలు మనల్ని అప్పుడప్పుడు భయం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) ఇలాంటి స్టంట్ వీడియో ఒకటి నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం నెటిజన్లు ఏమైనా చేస్తారు. అందుకు ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ లైక్ ల కోసం పాకులాడుతుంటారు. అలా చేసే క్రమంలో కొన్ని సార్లు గాయపడడం, మరికొన్ని సార్లు ఆస్పత్రి పాలవడం వంటి సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో.. ఓ వ్యక్తి రోడ్డుపై పడుకున్నాడు. మరో వ్యక్తి సైకిల్ తొక్కుతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఈ వీడియో చూశాక ఇలాంటి స్టంట్స్ చేయడం అవసరమా అని మీరు అనుకోక మానరు.
వైరల్ అవుతున్న క్లిప్ లో ఓ వ్యక్తి రోడ్డుపై పడుకున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి సైకిల్ పై వేగంగా వస్తాడు. అతను స్పీడ్ గా వచ్చి పడుకున్న వ్యక్తిని ఢీ కొడతాడు. వీడియోలో సైకిల్ ఆగిపోతుందేమోనని భావించినప్పటికీ అది పడుకున్న వ్యక్తిపై ఎక్కడం భయం కలిగిస్తుంది. దీంతో సైకిల్ తొక్కుతున్న వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈ ఘటనలో యువకులిద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఈ షాకింగ్ వీడియోను ద డార్విన్ అవార్డ్స్ అనే ఖాతా ద్వారా పోస్ట్ అయింది.