Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB: తెలంగాణ ఎస్సై అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌! 8 మార్కులు అదనంగా కలుపుతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన..

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 554 ఎస్సై పోస్టులకు ఆగ‌స్టు 7న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ 'కీ' ఆగస్టు 12న విడుదలైంది. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని..

TSLPRB: తెలంగాణ ఎస్సై అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌! 8 మార్కులు అదనంగా కలుపుతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన..
Tslprb
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 15, 2022 | 6:31 AM

TSLPRB SI Answer Key 2022: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 554 ఎస్సై పోస్టులకు ఆగ‌స్టు 7న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ ఆగస్టు 12న విడుదలైంది. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులు సాధించిన వారిని అర్హులుగా నిర్ణయించారు.

తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్‌లెట్‌లో 54, 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఆన్సర్‌ ‘కీ’పై ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో www.tslprb.in ఆన్‌లైన్‌ విధానం ద్వారా అభ్యంతరాలు లేవనెత్తడానికి బోర్డు అవకాశం కల్పించింది. పరీక్షను ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో నిర్వహించడంతో ఒక భాష నుంచి మరో భాషకు ప్రశ్నలను అనువాదం చేసే సమయంలో ఈ తప్పులు దొర్లినట్లు, ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లలో ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు వచ్చి ఉంటాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి.