AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హీట్ పెంచుతున్న మునుగోడు పాలిటిక్స్.. వ్యక్తిగత దూషణలపై దృష్టి మళ్లుతోందన్న రేవంత్

తెలంగాణ (Telangana) రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో మునుగోడు వేదికగా పాలిటిక్స్ మరోసారి వాడివేడీగా మారాయి....

Telangana: హీట్ పెంచుతున్న మునుగోడు పాలిటిక్స్.. వ్యక్తిగత దూషణలపై దృష్టి మళ్లుతోందన్న రేవంత్
Revanth Reddy
Ganesh Mudavath
|

Updated on: Aug 14, 2022 | 3:30 PM

Share

తెలంగాణ (Telangana) రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో మునుగోడు వేదికగా పాలిటిక్స్ మరోసారి వాడివేడీగా మారాయి. విజయం తమదంటే తమదేనని అన్ని పార్టీలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో మూడు మూటలా కడుపునిండా తినే భాగ్యం లేకుండా పోయిందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల ప్రజలు మోసపోయారని, 22 కోట్ల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ప్రధాని మోడీ కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని వివరించారు.

ప్రజల తరఫున నిలిచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. పోడు భూముల సమస్యలు తీర్చాలి. ఇందు కోసం రూ.5వేల కోట్లు రిలీజ్ చేసిన తర్వాత బీజేపీ ఓట్లు అడగాలి. కేసీఆర్‌ చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మునుగోడులో చర్చ జరగాలి. అంతే గానీ వ్యక్తిగత దూషణలపై కాదు.

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

మరోవైపు.. మునుగోడు బైపోల్‌ రాజకీయం హీట్ పెంచుతోంది. మాటల నుంచి వాల్‌ పోస్టర్ల వరకు విమర్శలు వెళ్లాయి. రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మునుగోడు నన్ను క్షమించదు అంటూ నారాయణపురం, చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లను ఎవరు అంటించారు. కాంగ్రెస్‌ శ్రేణులే అంటించారా? లేకపోతే రాజగోపాల్‌రెడ్డి అంటే గిట్టనివారు ఈ ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని పాలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి