Health: వర్షంలో తడుస్తున్నారా.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు
వర్షాకాలం (Rains) అంటేనే వ్యాధులు ముసిరే కాలం. వాతావరణం చల్లబడటం, వానలు కురవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటివి సాధారణమే. చాలా మంది రోడ్లపై నిలిచిపోయిన వాన నీటి నుంచే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అలా నిలిచిపోయిన...
వర్షాకాలం (Rains) అంటేనే వ్యాధులు ముసిరే కాలం. వాతావరణం చల్లబడటం, వానలు కురవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటివి సాధారణమే. చాలా మంది రోడ్లపై నిలిచిపోయిన వాన నీటి నుంచే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అలా నిలిచిపోయిన వాన నీటిలో నడవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రవహించే వర్షపు నీరు ఓ ప్రదేశంలో నిలిచిపోతాయి. ఇవి అనేక కాలుష్య రసాయనాలను కలిగి ఉంటుంది. కాబట్టి అందులో నుంచి నడవడం ద్వారా కాళ్ల నుంచి హానికారక వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిల్వ ఉన్న వర్షపు నీటిలో లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు (Health Problems) వచ్చే అవకాశం ఉంది. లెప్టోస్పైరోసిస్ వ్యాధికి గురైన వారు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. వారు సూచించిన ఔషధాలను వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా వర్షాకాలంలో మలేరియా, డయేరియా, కలరా, చికున్‌గున్యా, హెపటైటిస్, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా వర్షాకాలంలో నీరు కలుషితమవుతుంది. ఆ నీటిని తాగడం వల్ల హానికారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది. విరేచనాలు, వాంతులు అవుతాయి. డీహైడ్రేషన్ జరుగుతుంది. తీవ్రత మరీ ఎక్కువైతే కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది. అందుకే నీటిని కాచి, చల్లార్చి తాగడం ముఖ్యమనే విషయాన్ని అస్సలు మరిచిపోవద్దు. వర్షంలో తడిసి ఇంటికి రాగానే కాళ్లు కడుక్కుని, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. తాజాగా, వేడిగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వ్యాధులు విజృంభించకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవాలి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..