Viral Video: భారీవర్షాలతో కాలనీలోకి మొసలి.. హడలెత్తిపోయిన స్థానికులు.. వీడియో వైరల్‌

Madhya Pradesh: దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తేళ్లు, విషసర్పాలు తదితర జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక కాలనీలోకి మొసలి వచ్చింది.

Viral Video: భారీవర్షాలతో కాలనీలోకి మొసలి.. హడలెత్తిపోయిన స్థానికులు.. వీడియో వైరల్‌
Crocodile
Follow us
Basha Shek

|

Updated on: Aug 14, 2022 | 5:59 PM

Madhya Pradesh: దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తేళ్లు, విషసర్పాలు తదితర జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక కాలనీలోకి మొసలి వచ్చింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. శివపురి జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఈక్రమంలో శివపురి పాత బస్టాండ్‌ సమీపంలోని కాలనీ కూడా నీట మునిగింది. అయితే భారీ వరద నీరు కారణంగా అక్కడికి ఆదివారం ఒక మొసలి వచ్చింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాధవ్‌ నేషన్‌ల్‌ పార్క్‌ నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దింపి గంటపాటు శ్రమించి ఆ మొసలిని బంధించారు. సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సాంఖ్యసాగర్ సరస్సులో విడిచిపెట్టారు. అయితే కొన్ని గంటల పాటు వరద నీటిలో తచ్చాడుతున్న మొసలిని కొందరు తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే