Actress Sneha: కుమారుడి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన స్నేహ.. ఫొటోలు వైరల్‌

అందం, అభినయంతో దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి స్నేహ. సౌందర్య తర్వాత అంత హోమ్లీ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించిందీ అందాల తార. సినిమాల్లో బిజీగా ఉండగానే సహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిపోయిన..

Actress Sneha: కుమారుడి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన స్నేహ.. ఫొటోలు వైరల్‌
Actress Sneha
Follow us
Basha Shek

|

Updated on: Aug 13, 2022 | 9:43 PM

అందం, అభినయంతో దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి స్నేహ. సౌందర్య తర్వాత అంత హోమ్లీ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించిందీ అందాల తార. సినిమాల్లో బిజీగా ఉండగానే సహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిపోయిన స్నేహ పదేళ్ల క్రితం అతనితోనే ఏడడుగులు నడిచింది. వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలంగా ఇద్దరు పిల్లలు కూడా వారి జీవితంలోకి ప్రవేశించారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, స్పెషల్‌ రోల్స్‌లోనూ సందడి చేస్తోంది. అదేవిధంగా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలన్నింటనీ అందులో షేర్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లల బర్త్‌డేలు, పండగలప్పుడు వారిని అందంగా అలంకరించి ఆ ఫొటోలను ఫ్యాన్స్‌ తో పంచుకుంటోంది. అలా తాజాగా తన ఏడేళ్ల కుమారుడు విహాన్‌ పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది. అనంతరం భర్త పిల్లలతో దిగిన పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

అంతకుముందు పిల్లలను ముస్తాబు చేసే పనిలో భాగంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడారు. ఈ ఫొటోలను పంచుకుంటూ ‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు లడ్డు.. నువ్వు నాకు 7 సంవత్సరాల నుంచి సంతోషాన్ని, ప్రేమను అందిస్తున్నావు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునే కుమారుడివి నువ్వు.. నీపై నా ప్రేమను వర్ణించడానికి పదాలు రావడం లేదు.. హ్యాపీ బర్త్ డే విహాన్ తంగమ్’అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది స్నేహ. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే