“వ్యూస్ కోసం ఆ వీడియోను వైరల్ చేశారు”.. ఆవేదన వ్యక్తం చేసిన అంజలి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవడం ఆసక్తికరంగా మారింది. ఇక చాలా మంది సినిమా తారల పై నెగిటివిటి కూడా సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది.

వ్యూస్ కోసం ఆ వీడియోను వైరల్ చేశారు.. ఆవేదన వ్యక్తం చేసిన అంజలి
Heroine
Rajeev Rayala

|

Aug 13, 2022 | 9:39 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవడం ఆసక్తికరంగా మారింది. ఇక చాలా మంది సినిమా తారల పై నెగిటివిటి కూడా సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది. హీరోయిన్స్ గురించి బ్యాడ్ కామెంట్స్.. ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో లబోదిమంటున్నారు తారలు. తాజాగా ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ అవ్వడంతో నటి ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లాకప్ పేరుతో ఓ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న నటీనటులు తమ జీవితాల్లో ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా నటి అంజలి అరోరా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.

‘అంజలి ఎంఎంఎస్’ అనే ఓ వీడియో సాంగ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చింది. ఆ వీడియో చూసిన చాలా మంది తనపై రకరకాల ట్రోల్స్ చేశారని ఘోరమైన కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ కన్నన్‌ తో ఉన్న వీడియోకి నా పేరు, నా ఫోటో పెట్టి ప్రచారం చేశారు. ఇలా ఎవరి ఫ్యామిలీలోనైనా జరిగితే ఎంత భాదగా ఉంటుందో తెలుసా అంటూ ఎమోషనల్ అయ్యింది అంజలి. మీలా నాకు కూడా ఓ కుటుంబం ఉంటుంది అని మీరు ఆలోచిస్తే ఇలా చేయరు. యూట్యూబ్‌ లో పనికిమాలిన వ్యూస్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. నా కుటుంబం చాలా భాదపడింది. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అంజలి అరోరా.  ఇక అంజలికి సోషల్ మీడియాలో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

Anjali Arora

 మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu