- Telugu News Photo Gallery Cinema photos Next level of liger movie promotins ananya panday mesmirizing looks
Liger Movie: స్పీడ్ పెంచిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్ల సందడి..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’(Liger). ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Updated on: Aug 13, 2022 | 12:23 PM

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’(Liger). ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘లైగర్’ను విజయ్, అనన్య పాండే క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా పొలం గట్లపై ఈ జోడీ కనువిందు చేసింది.

ఇటీవల విజయ్, అనన్య ముంబై ట్రెయిన్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఆకట్టుకున్నారు. అలాగే ఓ యూనివర్సిటీలో రోజంతా స్టూడెంట్ల సమయం గడిపిన లైగర్ జోడీ తమ సినిమాను ఏంచక్క ప్రమోట్ చేసుకుంటోంది.

ఇటీవల Vijay Deverakonda గుజరాతీ తాళీని తింటున్న ఫొటోను పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ దుస్తుల్లో.. పొలం గట్లపై కనిపించారు.

ఎటు చూసిన పచ్చటి పైరు.. ఆహాల్లాదకరమైన వాతావరణం.. పొలం గట్లపై గువ్వాగోరింకలా లైగర్ జోడీ కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తులను ధరించిన విజయ్, అనన్య పాండే (Ananya Panday) భారతీయ కల్చర్ ను గుర్తు చేశారు.

మరోవైపు అనన్య పాండే వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. నాజుకూ అందాలను వెదజల్లుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనన్య ఆకర్షిస్తోంది. పొలం గట్లపై పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ మైమరిపిస్తోంది.




