ఇదేం మాస్‌ బ్యాటింగ్‌ రా సామీ.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 50 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. 20 ఏళ్ల వయసులోనే అరుదైన రికార్డు

The Hundred League 2022: ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఆధ్వర్యంలో జరుగుతోన్న ద హండ్రెడ్‌ లీగ్‌ (The Hundred League) టోర్నమెంట్లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు ఇష్టారాజ్యంగా చెలరేగుతుండడంతో బౌలర్లు చేష్టలుడిగిపోతున్నారు

ఇదేం మాస్‌ బ్యాటింగ్‌ రా సామీ.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 50 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. 20 ఏళ్ల వయసులోనే అరుదైన రికార్డు
Will Smeed
Basha Shek

|

Aug 11, 2022 | 2:13 PM

The Hundred League 2022: ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఆధ్వర్యంలో జరుగుతోన్న ద హండ్రెడ్‌ లీగ్‌ (The Hundred League) టోర్నమెంట్లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు ఇష్టారాజ్యంగా చెలరేగుతుండడంతో బౌలర్లు చేష్టలుడిగిపోతున్నారు. ఈక్రమంలో ద హండ్రెడ్‌ లీగ్‌ 2022 ఎడిషన్‌లో మొదటి సెంచరీ నమోదైంది. బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల యువ బ్యాటర్‌ విల్‌ స్మీడ్‌ (Will Smeed) లీగ్‌లో తొలి సెంచరీ సాధించి రికార్డు పుటల్లో కెక్కాడు. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ ప్లేయర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ చేసిన 92 పరుగులే హండ్రెడ్‌ లీగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది. అయితే తాజాగా సథరన్‌ బ్రేవ్‌ తో జరిగిన మ్యాచ్‌లో స్మీడ్‌ ఈ రికార్డును అధిగమించాడు. మొత్తం 50 బంతులు ఎదుర్కొన్న స్మీడ్‌ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మూడంకెల స్కోరు నమోదు చేశాడు.

స్మీడ్ సెంచరీతో మొదట బ్యాటింగ్‌ చేసిన బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు చేసింది. లివింగ్‌స్టోన్‌ (20 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సథరన్‌ బ్రేవ్‌ను హెన్నీ బ్రూక్స్‌(5/25), కేన్‌ రిచర్డ్‌ సన్‌(3/19) హడలెత్తించారు. ఫలితంగా 123 పరుగులకే కుప్పకూలింది. దీంతో బర్మింగ్‌హామ్‌ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మీడ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ప్రస్తుత ఎడిషన్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు ఇది తొలి విజయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu