Sachin Tendulkar: సరికొత్త వేషధారణలో మాస్టర్‌ బ్లాస్టర్‌.. మెహెందీతో మురిసిపోయిన సారా.. వైరలవుతోన్న ఫొటోస్‌

Sachin- Sara: మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరికొత్త వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన సోదరుడు నితిన్ టెండూల్కర్ కుమార్తె కరిష్మా వివాహం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిశాడు. వేడుకల్లో భాగంగా గోధుమ కలర్‌ షేర్వాణీ ధరించిన సచిన్‌

Sachin Tendulkar: సరికొత్త వేషధారణలో మాస్టర్‌ బ్లాస్టర్‌.. మెహెందీతో మురిసిపోయిన సారా.. వైరలవుతోన్న ఫొటోస్‌
Sachin Sara Tendulkar
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2022 | 6:46 PM

Sachin- Sara Tendulkar: మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరికొత్త వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన సోదరుడు నితిన్ టెండూల్కర్ కుమార్తె కరిష్మా వివాహం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిశాడు. వేడుకల్లో భాగంగా గోధుమ కలర్‌ షేర్వాణీ ధరించిన సచిన్‌.. తలపై ఎర్రటి తలపాగా (ఫేటా)తో ఓ రాజవంశీయుడిలా దర్శనమిచ్చాడు. తన వేషధారణకకు సంబంధించిన వీడియోను సచిన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనికి వెడ్డింగ్‌ షాదీ సెలబ్రేషన్స్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశాడు. తన అన్న కూతురు పెళ్లి వేడుకలో భాగంగానే ఈ ట్రెడిషినల్‌ వేర్‌తో పాటు ఫెటాను ధరించాను’ అని ఇందులో చెప్పుకొచ్చాడు సచిన్‌.

Sara

Sara

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమిండియా క్రికెటర్లు, అభిమానులు కూడా ఈపోస్టుపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక సచిన్‌ పెట్టిన పోస్ట్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా స్పందించాడు. సచిన్‌ను టీజ్‌ చేస్తూ.. ‘ఓయ్‌ సచిన్‌ కుమార్‌.. హే’ అని కామెంట్‌ పెట్టాడు. ఇక ఈ పెళ్లి వేడుకలో సచిన్‌ గారాల పట్టి సారా టెండూల్కర్ కూడా దేశీ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. సారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేయగా..అందులో ఆమె తన చేతులకు మెహందీ పెట్టుకుని దర్శనమిచ్చింది. ‘నా సోదరి పెళ్లి చేసుకోబోతోంది’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది, అయితే ఈ పెళ్లిలో అర్జున్ టెండూల్కర్ కనిపించలేదు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..