Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: మరోసారి హైదరాబాదీల మనసులు గెల్చుకున్న డేవిడ్‌ భాయ్‌.. సింధు విజయంపై ఏమన్నాడంటే?

David Warner: సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, జగన్‌తో సహా పలువురు ప్రముఖులు మన తెలుగుతేజానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

PV Sindhu: మరోసారి హైదరాబాదీల మనసులు గెల్చుకున్న డేవిడ్‌ భాయ్‌.. సింధు విజయంపై ఏమన్నాడంటే?
Pv Sindhu
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2022 | 1:14 PM

David Warner: కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. సింధుకి ఈ స్వర్ణం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే గత రెండు కామన్వెల్త్‌లలో ఆమె బంగారు పతకాన్ని ముద్దాడలేకపోయింది. అయితే బర్మింగ్‌హామ్‌లో మాత్రం ఆ కలను నెరవేర్చుకుంది. కాగా సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, జగన్‌తో సహా పలువురు ప్రముఖులు మన తెలుగుతేజానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా మన స్వర్ణ సింధూరానికి ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ (David Warner), అతని సతీమణి క్యాండిస్‌ కూడా కంగ్రాట్స్‌ చెప్పారు.

నీ విజయం అద్భుతం..

‘వెల్‌డన్‌ సింధు..అమేజింగ్ అచీవ్‌మెంట్’ అని వార్నర్‌ ట్వీట్‌ చేయగా..’ కామన్వెల్త్‌లో బంగారు పతకం గెల్చుకున్నందుకు కంగ్రాట్స్‌ సింధు.. నీ విజయం ఎంతో అద్భుతం’ అని వార్నర్‌ సతీమణి క్యాండిస్‌ మెసేజ్‌ చేసింది. దీనికి సింధు కూడా స్పందించింది. ‘థ్యాంక్స్‌ ఏ లాట్‌’ అని ఇద్దరికి రిప్లై ఇచ్చింది. కాగా వార్నర్‌ దంపతుల ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డేవిడ్‌ భాయ్‌ మళ్లీ మా భారతీయుల మనసులు గెల్చుకున్నావని ఫ్యాన్స్‌ అంటున్నారు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్‌ భాయ్‌ హైదరాబాదీలకు బాగా దగ్గరయ్యాడు. తెలుగు సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా సింధు విజయంపై స్పందించి మరోసారి హైదరాబాదీల మనసులు కొల్లగొట్టాడీ స్టార్‌ క్రికెటర్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..