Keerthy Suresh: మహానటి ఇంట మంగళవాయిద్యాలు.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కీర్తి! వరుడు ఎవరంటే?

Keerthy Suresh Marriage Rumours: ఇటీవల హీరోయిన్ల పెళ్లిపై సోషల్‌ మీడియాలో గాసిప్‌లు, పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. ఎక్కడో దొరికిన సమాచారం తీసుకుని నెట్టింటే పెళ్లి బాజాలు మోగిస్తున్నాయి.

Keerthy Suresh: మహానటి ఇంట మంగళవాయిద్యాలు.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కీర్తి! వరుడు ఎవరంటే?
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2022 | 12:21 PM

Keerthy Suresh Marriage Rumours: ఇటీవల హీరోయిన్ల పెళ్లిపై సోషల్‌ మీడియాలో గాసిప్‌లు, పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. ఎక్కడో దొరికిన సమాచారం తీసుకుని నెట్టింటే పెళ్లి బాజాలు మోగిస్తున్నాయి. మొన్న యాపిల్‌ బ్యూటీ హన్సికపై ఇలాంటి పుకార్లే పుట్టుకొచ్చాయి. ఓ వ్యాపారవేత్తతో పెళ్లి ఖరారైందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని హన్సిక చెప్పేయడంతో అంతా సైలెంట్‌ అయిపోయారు. అంతకుముందు నిత్యామేనన్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె కూడా వీడియో బైట్‌ ఇచ్చి మరీ తన పెళ్లి వార్తలను ఖండించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో స్టార్‌ హీరోయిన్‌ చేరింది. ఆమె మరెవరో కాదు మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని కోలీవుడ్ మీడియాతో పాటు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

గతంలోనూ పెళ్లి రూమర్లు..

రాజకీయాల్లో చురుగ్గా ఉంటోన్న ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కీర్తి కల్యాణం జరుగుతుందంటూ టాక్‌ వినిపిస్తోంది. తల్లిదండ్రులే వరడిని సెలెక్ట్‌ చేశారని, అందుకు కీర్తి కూడా దాదాపు ఓకే చెప్పిందట. అయితే తన పెళ్లి వార్తలపై అటు కీర్తి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా ఈ సొగసరి పెళ్లిపై ఇలాంటి వదంతులు రావడం ఇదేమి మొదటిసారి కాదు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే స్వయంగా కీర్తి కుటుంబ సభ్యులే వీటిని ఖండించడంతో ఈ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి వదంతులే హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఈవార్తలు నిజమో, అబద్ధమో కీర్తి కానీ ఆమె కుటుంబ సభ్యులు నోరువిప్పితే కానీ క్లారిటీ రాదు.

ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా మహేశ్‌బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో సందడి చేసింది కీర్తి. అప్పటివరకు వచ్చిన ఫ్లాప్‌లకు ఈ సినిమా అడ్డుకట్ట వేసిన ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి జోష్‌ ఇచ్చింది. ఆ ఉత్సాహంతోనే భోళా శంకర్‌ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. అదేవిధంగా హిందీలో ఘన విజయం సాధించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ మిమీ తెలుగు, తమిళ్‌ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే