Puneeth Rajkumar: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రకాశ్‌ రాజ్‌.. పునీత్ జ్ఞాపకార్థం ఏం చేశారంటే?

Prakash Raj: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) మనల్ని విడిచిపోయి సుమారు ఏడాదికావస్తోంది. గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి.

Puneeth Rajkumar: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రకాశ్‌ రాజ్‌.. పునీత్ జ్ఞాపకార్థం ఏం చేశారంటే?
Prakash Raj
Follow us

|

Updated on: Aug 07, 2022 | 4:23 PM

Prakash Raj: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) మనల్ని విడిచిపోయి సుమారు ఏడాదికావస్తోంది. గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు పునీత్. అదే స్ఫూర్తితో విశాల్‌ లాంటి పలువురు హీరోలు అప్పు బాటలోనే నడుస్తున్నారు. పవర్‌స్టార్‌ జ్ఞాపకార్థం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) కూడా ఇదే బాటలో నడిచారు. ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అంబులెన్స్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. మొదటిగా మైసూరు నగరంలోని మిషన్‌ ఆస్పత్రికి అప్పు ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ను ప్రకాశ్‌ రాజ్‌ అందజేశారు. ఈమేరకు పలు ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

కాగా అప్పు జ్ఞాపకార్థం ఈ ఏడాది తన పుట్టిన రోజు (మార్చి26) ‘అప్పు ఎక్స్‌ ప్రెస్‌’ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు ప్రకాశ్‌ రాజ్‌. ఇందులో భాగంగానే ఈ అంబులెన్స్‌ సేవలను ప్రారంభించారు. ఇక ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ పేరుతో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడీ సీనియర్‌ యాక్టర్‌. ముఖ్యంగా క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ పేదల కోసం పలు సహాయ కార్యక్రమాలు చేపట్టాడు. అంతేకాదు తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు