Bimbisara: బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో కల్యాణ్‌రామ్‌ బింబిసార.. రెండో రోజూ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Bimbisara Movie Collections: కొద్దిరోజులుగా స్తబ్ధత నెలకొన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది బింబిసార (Bimbisara) సినిమా. నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

Bimbisara: బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో కల్యాణ్‌రామ్‌ బింబిసార.. రెండో రోజూ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
Kalyan Ram Bimbisara
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2022 | 3:55 PM

Bimbisara Movie Collections: కొద్దిరోజులుగా స్తబ్ధత నెలకొన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది బింబిసార (Bimbisara) సినిమా. నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. చాలారోజుల తర్వాత థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావిడి, జోష్‌ కనిపిస్తోంది. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద ఓపెనింగ్స్‌ ఈ సినిమావే కావడం విశేషం. మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు కూడా తన జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది. ట్రేడ్‌ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకు గానూ రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

మరిన్ని థియేటర్లలో రిలీజ్..

కాగా ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అంటే ఇంకా రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ క్రమంలో వీకెండ్‌కు తోడు పాజిటివ్‌ బజ్‌ ఉండడంతో లభంగా బ్రేక్‌ఈవెన్‌ సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించి బింబిసార. బిందుసారుడి కాలానికి, నేటి వర్తమానానికి లింకు పెట్టి సోషియో ఫాంటసీ కథాంశంతో కొత్త డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందించాడు. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ రావడంతో మరిన్ని థియేటర్లలో బింబిసారను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..