Telugu News Sports News CWG 2022 india 1st ever gold medal in para powerlifting at cwg sudhir has impairment due to polio watch Telugu Sports News
CWG 2022: జ్వరం అతని జీవితాన్ని మార్చేసింది.. గోల్డెన్ పారా పవర్ లిఫ్టర్ సుధీర్ ఇంట్రెస్టింగ్ జర్నీ
Commonwealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు సుధీర్ (Sudhir) . పురుషుల హెవీవెయిట్ విభాగంలో 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన అతను ఈ ఈవెంట్‌లో మన దేశానికి మొదటి పతకం అందించాడు.
Commonwealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో భారత ఆటగాళ్లు పతకాల కోసం చెమటోడుస్తున్నారు. ఈక్రమంలో పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు సుధీర్ (Sudhir) . పురుషుల హెవీవెయిట్ విభాగంలో 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన అతను ఈ ఈవెంట్‌లో మన దేశానికి మొదటి పతకం అందించాడు. సుధీర్ సాధించిన ఈ పతకంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు మొత్తం 6 స్వర్ణాలు లభించాయి. కాగా ఈవెంట్‌లో మొత్తం 212 కిలోలు ఎత్తిన సుధీర్ పోలియో బాధితుడు. అయినా అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి దేశం మొత్తం గర్విస్తోంది.
Bahot badhiya Sudhir bhai! Congratulations for the Gold medal and new Games Record ?? https://t.co/Tpg4AC1qZW
కాగా 28 ఏళ్ల సుధీర్‌ది హరియాణా రాష్ట్రం. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. దీనికి తోడు 4 ఏళ్ల వయసులో అతను తీవ్ర జ్వరం కారణంగా పోలియో బారిన పడ్డాడు. అప్పటిదాకా ఆటలంటే అమితాసక్తి కలిగిన సుధీర్ పోలియోతో బాగా కుంగిపోయాడు. అయితే తన జీవితాశయాన్ని మాత్రం వదులుకోలేదు. పవర్‌లిఫ్టింగ్‌పై క్రమంగా ఆసక్తి పెంచుకున్నాడు. 2013లో పవర్‌లిఫ్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. 2016లో తన మొదటి జాతీయ పోటీలో బంగారు పతకం సాధించాడు. 2 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేశాడు. 2018 లో ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో తన మొదటి ప్రయత్నంలో 208 కిలోలు ఎత్తి, రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తి 134.5 పాయింట్లు సాధించి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు సుధీర్. బంగారు పతకం గెల్చుకుని భారతీయ అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. ఈక్రమంలో అతనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సుధీర్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. ‘ సుధీర్ భాయ్‌కి అభినందనలు. బంగారు పతకంతో పాటు కొత్త రికార్డు సృష్టించినందుకు శుభాకాంక్షలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
Sudhir lifted 212 kg in Para Power lifting and set new Games record to win Gold Medal for India!