AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: మా అమ్మానాన్నలకు నేనిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాన్వీ

Good Luck Jerry Movie: ఘోస్ట్‌ స్టోరీస్‌, రూహీ సినిమాలతో ఆకట్టుకున్న జాన్వీ తాజాగా గుడ్‌లక్‌ జెర్రీ (Good Luck Jerry) తో బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. 2018లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన తమిళ హిట్‌ చిత్రం కోలమావు కోకిలకి ఇది హిందీ రిమేక్.

Janhvi Kapoor: మా అమ్మానాన్నలకు నేనిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాన్వీ
Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Aug 04, 2022 | 9:54 AM

Share

Good Luck Jerry Movie: దివంగత అందాల తార శ్రీదేవి(Sridevi) వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌(Janhvi Kapoor). మొదటి సినిమా ధడక్‌ తోనే అందం, అభినయం పరంగా ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌తో ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది. ఘోస్ట్‌ స్టోరీస్‌, రూహీ సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గుడ్‌లక్‌ జెర్రీ (Good Luck Jerry) తో బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. 2018లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన తమిళ హిట్‌ చిత్రం కోలమావు కోకిలకి ఇది హిందీ రిమేక్. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వీ తన వృత్తిగత, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నాకు విలువ లేదనిపించింది..

‘కెరీర్‌ ఆరంభంలో ఎలాంటి అర్హతలు లేకుండానే ధడక్, గుంజన్ సక్సేనా సినిమాలు నా దగ్గరకు వచ్చాయనిపించింది. స్టార్‌ కిడ్‌గా ప్రతిదీ నాకు చాలా ఈజీగా అందాయని ఫీల్‌ అయ్యాను. టెక్నికల్‌గా చెప్పకోవాల్సి వస్తే నాకెలాంటి విలువ లేదనిపించింది. అమ్మానాన్నల వల్లే నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయని చాలాసార్లు అనిపించింది. అందుకు కాను వారిపట్ల నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే నేను నటనను ప్రేమిస్తున్నాను. దాని కోసమే జీవిస్తున్నాను. నేను నా పని చేసుకుంటున్నాను. నా తల్లిదండ్రుల ప్రేమకి, వారి వల్ల నాకు వస్తో్న్న వకాశాలకి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చింది జాన్వీ. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాలో నటిస్తోందీ అందాల తార. అదేవిధంగా సన్నీ కౌశల్‌తో కలిసి మిలీ, వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..