CWG 2022: కామన్వెల్త్‌లో ముచ్చటగా మూడో మెడల్.. బాలయ్య స్టైల్‌లో తొడగొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్‌

Commonwealth Games 2022: పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ ఠాకూర్ (Vikas Thakur) రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కిలోల బరువు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.

CWG 2022: కామన్వెల్త్‌లో ముచ్చటగా మూడో మెడల్.. బాలయ్య స్టైల్‌లో తొడగొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్‌
Vikas Thakur
Follow us
Basha Shek

|

Updated on: Aug 03, 2022 | 8:36 AM

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తమకు బాగా అచ్చొచ్చిన ఈవెంట్‌లో పతకాల పంట పండిస్తున్నారు. మొదటి 4 రోజుల్లో ఏకంగా 8 పతకాలు గెల్చుకున్న భారత వెయిట్‌లిఫ్టర్లు ఐదో రోజు కూడా సత్తాచాటారు. పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ ఠాకూర్ (Vikas Thakur) రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కిలోల బరువు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కాగా కామన్‌వెల్త్‌లో వికాస్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన ఈ పంజాబీ వెయిట్‌లిఫ్టర్‌.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.

రెండు రోజులు అన్నం తినలేదు..

లూధియానాకు చెందిన వికాస్ కొన్ని రోజుల క్రితం దారుణ హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలాకుపెద్ద అభిమాని. సిద్ధూ మూసేవాల మరణవార్తను తెలుసుకుని అతను చాలా మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల వరకు అన్న పానీయాలు ముట్టలేదు. అందుకే కామన్వెల్త్ లో మెడల్‌ గెలిచిన వెంటనే బర్మింగ్‌హామ్‌ వేదికగా సిద్ధూకు ఘన నివాళి అర్పించాడీ స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌. ఈ సందర్భంగా గాల్లోకి పంచ్‌లు విసురుతూ బాలయ్య స్టైల్‌లో తొడగొట్టి సంబరాలు చేసుకున్నాడు. ‘సిద్ధూ హత్య తర్వాత రెండు రోజుల పాటు నేను అన్నం ముట్టలేదు. నేను అతనిని ఎప్పుడూ కలవలేదు కానీ అతని పాటలు ఎప్పుడూ నాతో ఉంటాయి. నేను ఆయనకు ఎప్పుడూ పెద్ద అభిమానిని’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వికాస్‌. కాగా ఠాకూర్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే