Telugu movies: జులైలో విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అంతకుముందు రిలీజైన చిత్రాలు కూడా మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్త స్తబ్ధత నెలకొంది. ఈక్రమంలోనే ఆగస్టు మొదటి వారంలో థియేటర్, ఓటీటీల్లో సందడి చేసేందుకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్‌ల సీతారామం సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాయి. అలాగే పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో అడుగుపెట్టనున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో ఈ వారం అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం రండి.
థియేటర్లలో
బింబిసార
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ్ తెరకెక్కించిన చిత్రం బింబిసార. సంయుక్తా మేనన్, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. అటు బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్ అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 5 ప్రేక్షకుల ముందుకు రానుంది.
సీతారామం
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం సీతా రామం. మృణాళ్ ఠాకూర్, రష్మిక మందాన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథాచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాశ్‌రాజ్ లాంటి ప్రముఖులు నటిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 5 న రిలీజ్ కానుంది.
ఓటీటీల్లో
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..