Pushpa 2: పుష్ప 2 పై షూటింగ్స్ బంద్ ఎఫెక్ట్ ?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ఇండస్ట్రీలో సినిమాల నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యునరేషన్స్, కార్మికుల వేతనాలు, ఓటీటీలలో విడుదల, ప్రొడక్షన్ ఖర్చులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు

Pushpa 2: పుష్ప 2 పై షూటింగ్స్ బంద్ ఎఫెక్ట్ ?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Pushpa 2
Follow us

|

Updated on: Aug 02, 2022 | 8:58 AM

బాక్సాఫీస్ దగ్గర డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరెక్కించిన పుష్ప సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ప్రేక్షకులంతా పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా తెలుగు చిత్రపరిశ్రమలో జరుగుతున్న షూటింగ్ బంద్ ప్రభావం అల్లు అర్జున్ సినిమా ఎఫెక్ట్ చూపించనుందని.. దీంతో పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ మరింత ఆలస్యం కానుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ వై రవిశంకర్ పుష్ప 2 మూవీపై క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో సమ్మే జరుగుతుంది. మేము ఆగస్ట్ చివరి వారం నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తాము లేదా బంద్ ముగిసిన తర్వాత స్టార్ట్ చేస్తాము. చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం తాత్కలికంగా షూటింగ్స్ నిలిపివేశాము. నిర్మాతలంతా ఒక్కచోటికి చేరి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించుకుంటాము. సమ్మే ముగిసిన తర్వాత పుష్ప 2 రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో సినిమాల నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యునరేషన్స్, కార్మికుల వేతనాలు, ఓటీటీలలో విడుదల, ప్రొడక్షన్ ఖర్చులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి తెలుగు చిత్రపరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోగా.. హైదరాబాద్ లో జరుగుతున్న ఇతర భాషల చిత్రాల చిత్రీకరణలు యథావిదిగా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.