Sai Pallavi: సాయి పల్లవికి ఇష్టమైన ప్రదేశం ఏంటో తెలుసా.. ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తుందంటే..
సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే సాయి పల్లవి ఇష్టాలను, అభిరుచిలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్.
మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది సాయి పల్లవి (Sai Pallavi). ఈ మూవీలో మలర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తెలంగాణ అమ్మాయి భానుమతి పాత్రలో అదరగొట్టింది. ఫిదా సూపర్ హిట్ తర్వాత తెలుగులో ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ..స్క్రీప్ట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలకు ఓకే చెప్పింది సాయి పల్లవి. అలా మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ఇటీవల విరాటపర్వం, గార్గిసినిమాలతో అలరించింది. నటన పరంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే సాయి పల్లవి ఇష్టాలను, అభిరుచిలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్.
ఇటీవల సాయి పల్లవి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి చెప్పుకొచ్చింది. తనకు సముద్ర తీరం అంటే చాలా ఇష్టమని..ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా బీచ్ కు వెళ్లేందుకు ఇష్టపడతానని చెప్పింది. అయితే సముద్రతీరం అంటే ఎందుకంత ఇష్టమనేది తాను చెప్పలేనని, కానీ అలా నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిది.. ధ్యానం చేసినట్టుగానే ఉంటుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని తెలిపింది. అలాగే బీచ్ తర్వాత ఎక్కువగా ఇష్టమైన వ్యాపకం పుస్తకాలు చదవడం అని.. సినిమా స్క్రిప్ట్ ను కూడా ఓ పుస్తకంలా భావిస్తూ చదువుతుంటాను అని చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇటీవలే గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తప్పుడు కేసులో చిక్కుకున్న తండ్రిని కాపాడుకునే కూతురి పాత్రలో అద్బుతంగా నటించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.