Karthikeya 2: కార్తికేయ 2 వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే ఏకంగా రూ. 6 లక్షలు.. ఏలాగంటే..

అంతేకాకుండా.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్.

Karthikeya 2: కార్తికేయ 2 వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే ఏకంగా రూ. 6 లక్షలు.. ఏలాగంటే..
Karthikeya 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 01, 2022 | 6:50 AM

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న కార్తికేయ 2 (Karthikeya 2) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కేరళ కుట్టి అనుపమ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్‏కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. దీని కోసం సపరేటుగా ఒక కాంటెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల విలువ గల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే హైదరాబాదులో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.